Naseeruddin Shah: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల వివాదంలో ప్రధాని జోక్యం చేసుకోవాలి: బాలీవుడ్ నటుడు నసీరుద్ధీన్ షా

  • మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల దుమారం
  • ఈ అంశం విషంలా వ్యాపిస్తోందన్న నసీరుద్దీన్ షా
  • మోదీనే అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి
  • మోదీ ఏదో ఒకటి చేయాలని వ్యాఖ్యలు
Bollywood actor Naseeruddin Shah seeks PM Modi intervention into prophet issue

బీజేపీ బహిష్కృత నేతలు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల ఫలితంగా భారత్ అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొంటోంది. దేశీయంగానూ తీవ్ర దుమారం రేగుతోంది. దీనిపై బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా స్పందించారు. ఈ వివాదంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ అంశం విషంలా వ్యాపిస్తోందని, దీనికి ప్రధాని మోదీ అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశారు. 

"విషం వెదజల్లే వ్యక్తుల్లో కొంత మంచి స్పృహను తట్టిలేపాలని ప్రధాని మోదీని అభ్యర్థిస్తున్నా. హరిద్వార్ లోని ధర్మసంసద్ లో తాను ఏం చెప్పారో దాన్నే నమ్మేట్టయితే, మరోసారి దాన్నే చెప్పాలి. తాను అక్కడ ఏంచెప్పారో దాన్ని నమ్మనట్టయితే, తాను నమ్మడంలేదన్న విషయాన్ని చెప్పాలి" అని నసీరుద్దీన్ షా పేర్కొన్నారు. మోదీని ట్విట్టర్ లో అనుసరించే విద్వేషవాదులు మరింత విషం వెళ్లగక్కకుండా అడ్డుకోవాలని అన్నారు. మోదీనే ఏదో ఒకటి చేయాలని తెలిపారు.

More Telugu News