Mahesh Babu: త్రివిక్రమ్ ... మహేశ్ సినిమాలో రష్మిక!

Rashmika in Trivikram movie
  • 'పుష్ప'తో భారీ సక్సెస్ అందుకున్న రష్మిక 
  • 'పుష్ప 2' కోసం జరుగుతున్న సన్నాహాలు 
  •  తమిళంలో విజయ్ జోడీగా ఛాన్స్ అందుకున్న రష్మిక 
  • మహేశ్ సరసన మరోసారి మెరిసే ఛాన్స్
రష్మిక మందన్నకి తెలుగు .. కన్నడ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. ఇక తమిళ .. హిందీ భాషల్లోను అదే రేంజ్ లో చక్రం తిప్పే సమయం కోసం ఆమె వెయిట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె నుంచి వచ్చిన 'పుష్ప' సంచలన విజయాన్ని సాధించింది. ఆ తరువాత చేసిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' మాత్రం నిరాశపరిచింది. ఇక ప్రస్తుతం ఆమె చేతిలో 'పుష్ప 2' మాత్రమే ఉంది. 

తమిళంలో ఆమె విజయ్ సరసన కథానాయికగా నటించడానికి రెడీ అవుతోంది. ఇక తెలుగులో త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్లో చేయనున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్లో మూడో సినిమా రూపొందుతోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. 

ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే పేరు వినిపించింది. ఇప్పుడు కొత్తగా రష్మిక పేరు తెరపైకి వచ్చింది. త్రివిక్రమ్ కి పూజ హెగ్డే సెంటిమెంట్ ఉండటం వలన ఆమెను తప్పించడమనేది జరగదు. మరో హీరోయిన్ గా రష్మికను తీసుకున్నారా? లేదా? అనే విషయంలోనే క్లారిటీ రావలసి ఉంది. ఆల్రెడీ 'సరిలేరు నీకెవ్వరు'లో ఆమె మహేశ్ జోడీగా సందడి చేసిన సంగతి తెలిసిందే.
Mahesh Babu
Rashmika Mandanna
Trivikram Movie

More Telugu News