లడఖ్ సమీపంలో చైనా వంతెన నిర్మాణం పట్ల అమెరికా సైనిక జనరల్ స్పందన
- కొంతకాలంగా సరిహద్దుల వెంబడి చైనా నిర్మాణాలు
- లడఖ్ సమీపంలో మరో వంతెన నిర్మాణం
- ఇది మేల్కొలుపు వంటిదన్న జనరల్ ఫ్లిన్
- చైనాకు అడ్డుకట్ట వేయాలని పిలుపు
హియాలయాల పొడవునా చైనా నిర్మాణాలు చేపడుతున్న తీరు చూస్తుంటే ఈ ప్రాంతంలో అస్థిరతను పెంపొందిస్తూ, కబళించి వేయాలన్న ప్రయత్నంగా కనిపిస్తోందని ఫ్లిన్ అభివర్ణించారు. ఈ ప్రాంతంలో ఇటువంటి ధోరణులు ఎంతమాత్రం ఉపయుక్తం కాదని, అసలిదంతా ఎందుకు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోందని అన్నారు.
ఈ నేపథ్యంలో, చైనా దుందుడుకు ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు అమెరికా, భారత్ కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనరల్ ఫ్లిన్ అభిప్రాయపడ్డారు. కాగా, ఈ అమెరికా సైనిక జనరల్ ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్నారు. తాజాగా ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేతో సమావేశమయ్యారు.