మంత్రి అంబటి రాంబాబుపై సీఐడీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన దేవినేని ఉమ
- టీడీపీ, వైసీపీ మధ్య ఫేక్ ట్వీట్ రగడ
- తన ట్విట్టర్ అకౌంట్ మార్ఫింగ్ చేశారన్న ఉమ
- దీని వెనుక జగన్, సజ్జల ఉన్నారని ఆరోపణ
ఫేక్ ట్వీట్ల వెనుక జగన్, సజ్జల ఉన్నారని ఉమ ఆరోపించారు. నేరపూరిత కుట్ర ఆరోపణలపై సెక్షన్ల కింద జగన్, సజ్జల, అంబటిపై చర్యలు తీసుకోవాలని సీఐడీని కోరినట్టు తెలిపారు. కులాల మధ్య, పార్టీల మధ్య విద్వేషాలు రగిల్చేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.
గౌతు శిరీష వంటి టీడీపీ నేతలను, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఫేక్ ట్వీట్ అంశంపై మౌనంగా ఉన్న అంబటి రాంబాబు తప్పు అంగీకరించినట్టుగానే భావిస్తున్నామని అన్నారు. మహానాడు విజయవంతం అయినందునే తమపై ఈ కుయుక్తులకు పాల్పడుతున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు.