రేపటి నుంచే ఏపీలో ఉద్యోగుల బదిలీలు... గైడ్ లైన్స్ జారీ చేసిన ప్రభుత్వం
- ఉద్యోగుల బదిలీలపై సోమవారమే జగన్ సంతకం
- ఆ మరునాడే ప్రభుత్వం నుంచి ఉత్తర్వుల జారీ
- రేపటి నుంచి 17 వరకు కొనసాగనున్న బదిలీలు
ఉద్యోగుల సాధారణ బదిలీలకు సంబంధించిన ఫైల్‌పై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారమే సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఈ నెల 17లోగా ఉద్యోగుల బదిలీలు పూర్తి అయ్యేలా చూడాలంటూ జగన్ సూచించారు. బదిలీల్లో ఎలాంటి వివాదాలు రాకుండా చూడాలని కూడా జగన్ అధికారులకు సూచించారు. సీఎం సూచనలకు అనుగుణంగానే తాజాగా మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.