Agni-IV: అణ్వస్త్ర సహిత అగ్ని-4 క్షిపణి పరీక్ష విజయవంతం

  • ఒడిశాలోని కలాం దీవి నుంచి ప్రయోగం
  • అగ్ని-4 రేంజి 4 వేల కిలోమీటర్లు
  • తాజా పరీక్షపై రక్షణ శాఖ ప్రకటన
  • పరీక్ష అన్ని విధాలా సంతృప్తికరమని వెల్లడి
India successfully test fires nuclear capable Agni IV missile

భారత్ అణ్వస్త్ర సామర్థ్యాన్ని ఇనుమడింపజేసేలా అగ్ని-4 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. కేంద్ర స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో తాజా పరీక్ష నిర్వహించారు. అణ్వాయుధ సహిత అగ్ని-4 క్షిపణి రేంజి 4 వేల కిలోమీటర్లు. ఇది ఐఆర్ బీఎమ్ (ఇంటర్మీడియట్ రేంజి బాలిస్టిక్ మిస్సైల్) శ్రేణికి చెందినది అని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

రాత్రి 7.30 గంటలకు ఓడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ప్రయోగించినట్టు ఓ ప్రకటనలో వివరించింది. సాధారణ కసరత్తుల్లో భాగంగానే తాజా పరీక్ష చేపట్టినట్టు తెలిపింది. ఈ ప్రయోగం ద్వారా అగ్ని-4లో అన్ని వ్యవస్థలు సజావుగా పనిచేస్తున్నట్టు వెల్లడైందని, ఈ క్షిపణి విశ్వసనీయత మరోసారి నిరూపితమైందని రక్షణ శాఖ పేర్కొంది. లోపాలకు తావులేని రీతిలో కనీస నిరోధ సామర్థ్యాన్ని కలిగి ఉండాలన్న భారత్ విధానాన్ని ఈ విజయవంతమైన పరీక్ష మరోసారి చాటిచెప్పిందని వివరించింది.

More Telugu News