Anantha Babu: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు

YSRCP MLC Anantha Babu to attend court today
  • మాజీ డ్రైవర్ ను హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న అనంతబాబు
  • ఈరోజుతో ముగియనున్న రిమాండ్ గడువు
  • ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరు పరుచనున్న పోలీసులు
మాజీ డ్రైవర్, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఉన్నారు. ఆయనకు కోర్టు విధించిన రిమాండ్ గడువు ఈ రోజుతో ముగుస్తోంది. దీంతో, ఈరోజు ఆయనను రాజమండ్రిలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో పోలీసులు హాజరు పరుచనున్నారు. ఈరోజు జరిగే విచారణలో కోర్టు ఆయన రిమాండ్ ను పొడిగిస్తుందా? లేక బెయిల్ ఇస్తుందా? అనే విషయం తేలనుంది. మరోవైపు అనంతబాబుకు కఠిన శిక్ష విధించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Anantha Babu
YSRCP MLC
Court

More Telugu News