Kothapalli Subbarayudu: కొత్తపల్లి సుబ్బారాయుడుతో ముద్రగడ భేటీ

Mudragada Padmanabham meets Kothapalli Subbarayudu
  • ఇటీవలే సుబ్బారాయుడుని సస్పెండ్ చేసిన వైసీపీ
  • తమ భేటీ వెనుక రాజకీయ ఉద్దేశం లేదన్న ముద్రగడ
  • కాపులు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తున్నారంటున్న విశ్లేషకులు
మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుని వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వైసీపీలో చోటుచేసుకున్న ఈ పరిణామం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు, నిన్న నరసాపురంలో సుబ్బారాయుడుతో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భేటీ అయ్యారు. ఈ సమావేశం రాజకీయ పరంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీ అనంతరం మీడియాతో ముద్రగడ మాట్లాడుతూ, తమ కలయిక వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని తెలిపారు. 

అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన సుబ్బారాయుడుని ముద్రగడ కలవడం వెనుక ఇతర కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాపులు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్నారని వారు చెపుతున్నారు. ఎన్నికల సమయానికి కాపులందరినీ ఒక గొడుగు కిందకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Kothapalli Subbarayudu
Mudragada Padmanabham
YSRCP

More Telugu News