ప్రభుత్వ బడిలో చేరే పిల్లలకు నెలకు రూ. 500.. పుస్తకాలు, దుస్తుల ఖర్చు కూడా నాదే.. ఓ సర్పంచ్ హామీ
- పిల్లలకు ప్రోత్సాహకంగా ప్రతి నెల రూ. 500 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సర్పంచ్ శారద
- బడిబాటలో భాగంగా 50 మందిని చేర్పించాలని లక్ష్యం
- హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ సర్పంచ్‌గా ఉన్న శారద
ఈ రెండు గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ బడుల్లో చేరే పిల్లలకు నెలకు రూ. 500 చొప్పున ప్రోత్సాహకం ఇవ్వడంతోపాటు వారి దుస్తులు, పుస్తకాలకు అయ్యే ఖర్చును కూడా భరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ రెండు గ్రామాల్లోని పాఠశాలల్లో ప్రస్తుతం 70 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా కనీసం మరో 50 మందిని చేర్పించాలని నిర్ణయించుకున్నట్టు సర్పంచ్ శారద తెలిపారు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.