తమిళనాడులో విషాదం... నదిలో మునిగిపోయి ఏడుగురు అమ్మాయిల మృతి
- కడలూరు వద్ద నదిలో స్నానానికి దిగిన అమ్మాయిలు
- నదిలో పెరిగిన నీటి ప్రవాహం
- బయటికి రాలేకపోయిన అమ్మాయిలు
అక్కడున్నవారు ఇది గమనించి నదిలో దిగి వారిని బయటికి తీశారు. హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ అమ్మాయిలు మృతి చెందారు. కాగా, మరణించిన అమ్మాయిలు సంఘవి (16), సుముత (18), నవిత (18), ప్రియదర్శిని (15), మోనిష (18), దివ్యదర్శిని (10), ప్రియ (18)గా గుర్తించారు. వీరంతా కుచ్చిపాలయం, అయంకురింజిపడి గ్రామాలకు చెందినవారు. వారిలో ప్రియదర్శిని, దివ్యదర్శిని అక్కాచెల్లెళ్లు.