KTR: బీజేపీ అన్ని మతాలను గౌరవించే పార్టీనే అయితే తెలంగాణ బీజేపీ చీఫ్ ని ఎందుకు సస్పెండ్ చేయదు?:  కేటీఆర్

KTR asks BJP why the do not act on Telangana BJP Chief
  • మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నుపుర్, నవీన్ 
  • పార్టీ నుంచి తొలగించిన బీజేపీ హైకమాండ్
  • స్పందించిన కేటీఆర్
  • తెలంగాణ బీజేపీ చీఫ్ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడని వెల్లడి
ఓ మతాన్ని గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ ను బీజేపీ సస్పెండ్ చేయడం తెలిసిందే. తమ పార్టీ అన్ని మతాలను గౌరవిస్తుందని ఈ సందర్భంగా బీజేపీ హైకమాండ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఏ మతానికి సంబంధించిన వారిని గానీ, మతాన్ని గానీ అవమానించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొంది. 

దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. బీజేపీ నిజంగానే అన్ని మతాలను సమానంగా గౌరవించేట్టయితే తెలంగాణ బీజేపీ చీఫ్ ను ఎందుకు సస్పెండ్ చేయదు? అని ప్రశ్నించారు. మసీదులన్నీ తవ్వేయాలని, ఉర్దూను నిషేధించాలని కోరుతూ బహిరంగ వ్యాఖ్యలు చేసిన అతడిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు?  అంటూ నిలదీశారు. జేపీ నడ్డా గారూ... ఎందుకీ తేడాలు? ఏమైనా స్పష్టత ఇవ్వగలరా? అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
KTR
BJP
Telangana Chief
JP Nadda

More Telugu News