Namita: సీమంతం జరుపుకున్న నమిత

Namita gets Seemantham
  • తెలుగు ప్రేక్షకులను అలరించిన నమిత
  • సొంతం చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయం
  • 2017లో వీరేంద్ర చౌదరితో పెళ్లి
  • ఇటీవల బేబీ బంప్ ఫొటోలు పంచుకున్న వైనం
తెలుగు ప్రేక్షకులకు నమిత (41) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సొంతం చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయిన ఈ బొద్దుగుమ్మ మొన్నటి సింహా చిత్రంలోనూ విశేషంగా అలరించింది. నమిత 2017లో తన బాయ్ ఫ్రెండ్ వీరేంద్ర చౌదరిని పెళ్లాడింది. ఇటీవల ఆమె గర్భవతి కాగా, తాజాగా సీమంతం జరుపుకుంది. నమిత సీమంతం ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. ఆమె సీమంతం కార్యక్రమానికి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. తన బేబీ బంప్ ఫొటోలను కూడా నమిత ఇటీవల అభిమానులతో పంచుకోవడం తెలిసిందే.
Namita
Seemantham
Pregnant
Actress

More Telugu News