రూ.151 ప్లాన్ తో బంపర్ ఆఫర్ ప్రకటించిన జియో
- డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఉచితం
- మూడ్నెల్ల పాటు లభ్యం
- రూ.151 పూర్తిగా డేటా ప్లాన్
- 90 రోజుల కాలపరిమితితో 8 జీబీ డేటా
ఇక ఈ రూ.151 ప్లాన్ ను కొనుగోలు చేసిన వారు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా పొందవచ్చు. అయితే ఏదైనా సాధారణ ప్లాన్ పై కొనసాగుతున్నప్పుడు మాత్రమే ఈ డేటా ప్లాన్ ను కొనుగోలు చేసే వీలుంటుంది.
ఇవే కాకుండా రూ.333, రూ.583, రూ.783 ప్లాన్లను కూడా జియో ప్రకటించింది. వీటన్నింటిలోనూ మూడు నెలల కాలపరిమితితో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది.