Raghunandan Rao: హైదరాబాద్ గ్యాంగ్ రేప్.. ఎమ్మెల్యే కొడుకు ఫొటోలను విడుదల చేసిన రఘునందన్ రావు!

Raghunandan Rao releases Hyderabad gang rape victim photo
  • తెలంగాణలో కలకలం రేపుతున్న హైదరాబాద్ గ్యాంగ్ రేప్
  • పోలీసుల బెదిరింపులకు భయపడే వాళ్లు ఎవరూ లేరన్న రఘునందన్ 
  •  అందుకే ఆధారాలు చూపిస్తున్నామని వెల్లడి   
  •  నిందితుల పేర్లను ఎందుకు దాస్తున్నారని నిలదీత 
హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్ ఘటనలో టీఆర్ఎస్, ఎంఐఎం నేతల పిల్లలు ఉన్నారనే విషయం రాజకీయ పరంగా ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ వ్యవహారంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని విపక్షాలు మండిపడుతున్నాయి. ఆధారాలే లభించలేదని పోలీసులు చెపుతున్న క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కొన్ని ఆధారాలను మీడియా ముఖంగా బయటపెట్టారు. అమ్నేషియా పబ్ వద్ద బెంజ్ కారులో ఉన్న ఎమ్మెల్యే కొడుకు, కారులో సదరు అమ్మాయితో అసభ్యంగా వ్యవహరిస్తున్న ఫొటోలను ఆయన విడుదల చేశారు.  

ఈ సందర్భంగా రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ, పోలీసుల బెదిరింపులకు భయపడే వాళ్లు ఎవరూ లేరని అన్నారు. మమ్మల్ని భయపెట్టడం మానేసి, తప్పులు చేసిన వారిని భయపెట్టండని వ్యాఖ్యానించారు. ఆధారాలు లేకుండా మాట్లాడితే కేసులు పెడతామని పోలీసులు అన్నారని... అందుకు ఈ ఆధారాలన్నీ చూపిస్తున్నానని చెప్పారు.

అత్యాచారానికి పాల్పడిన నిందితులను పోలీసులు ఎందుకు సీక్రెట్ గా దాస్తున్నారని ప్రశ్నించారు. నిందితులను ఇప్పటికే దేశం దాటించారని చెప్పారు. నిందితులు మేజరా? లేక మైనరా? అనే విషయం అనవసరమని చెప్పారు. నిర్భయ కేసులో కూడా మైనర్ల పేర్లు బయటకు వచ్చాయని... ఇక్కడ మన పోలీసులు నిందితుల పేర్లను ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు.
Raghunandan Rao
BJP
Hyderabad
Gang Rape

More Telugu News