Swiggy: హైదరాబాద్ గచ్చిబౌలిలో స్విగ్గీ డెలివరీ బాయ్ పై రాడ్లు, కర్రలతో 20 మంది హోటల్ సిబ్బంది దాడి

Hotel Staff Attacks Swiggy Delivery boy With Rods and Sticks In Hyderabad
  • ఆర్డర్ లేట్ అయిందని అడిగినందుకు దారుణం
  • తీవ్రగాయాలపాలైన డెలివరీ బాయ్
  • న్యాయం చేయాలంటూ డెలివరీ బాయ్స్ ఆందోళన
హైదరాబాద్ గచ్చిబౌలిలో దారుణం జరిగింది. దాదాపు అరగంట పాటు హోటల్ వద్ద వేచి చూసినా ఆర్డర్ ఇవ్వలేదని, ఎందుకు లేట్ అయిందని అడిగినందుకు స్విగ్గీ డెలివరీ బాయ్ పై హోటల్ నిర్వాహకులు అతి కిరాతకంగా దాడి చేశారు. 20 మంది కలిసి రాడ్లు, కర్రలతో డెలివరీ బాయ్ మీద విరుచుకుపడ్డారు. 

ఘటన గురించి తెలిసిన పోలీసులు.. అక్కడకు చేరుకుని ఘర్షణను ఆపారు. తీవ్రంగా గాయపడిన డెలివరీ బాయ్ ను ఆసుపత్రికి తరలించారు. దాడి ఘటనతో స్విగ్గీ డెలివరీ బాయ్స్ హోటల్ ముందు ఆందోళనకు దిగారు. బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హోటల్ యజమానిపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.
Swiggy
Attack
Delivery Boy
Crime News
Hyderabad
Police
Hyderabad Police

More Telugu News