గ్యాంగ్ రేప్‌తో నాకు సంబంధం లేదు: తెలంగాణ హోం మంత్రి మనవడు పుర్ఖాన్
- ఆరోపణలు చేసిన వారు నిజాలు తెలుసుకోవాలన్న ఫుర్ఖాన్
- ఆరోజు మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఉన్నానని వెల్లడి
- తాను ఎవరికీ పార్టీ ఇవ్వలేదని స్పష్టీకరణ
- వాళ్లు ఎవరో కూడా తనకు తెలియదన్న పుర్ఖాన్
గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా భావిస్తున్న రోజున తాను మినిస్టర్ క్వార్టర్స్‌లో ఉన్నానని పుర్ఖాన్ తెలిపారు. తాను ఆ రోజు ఎవరికీ పార్టీ ఇవ్వలేదని కూడా ఆయన తెలిపారు. పార్టీలో పాల్గొన్న వారు, గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డ వారు ఎవరో కూడా తనకు తెలియదని చెప్పారు. తనపై ఆరోపణలు చేసిన వారు నిజాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.