Hyderabad: రేప్ కేసులో పోలీసుల అదుపులో తెలంగాణ వ‌క్ఫ్ బోర్డు చైర్మ‌న్ కొడుకు

hyderabad police arrests telangana state vakf boadr chairman son
  • ఆమ్నేషియా ప‌బ్‌లో బాలిక‌పై గ్యాంగ్ రేప్‌
  • కేసు న‌మోదు చేసుకున్న జూబ్లీ హిల్స్ పోలీసులు
  • కేసులో నిందితుడిగా తెలంగాణ వ‌క్ఫ్ బోర్డు చైర్మ‌న్ కుమారుడు
  • హైద‌రాబాద్ శివారులో మ‌హ్మ‌ద్ ఖాద‌ర్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైద‌రాబాద్‌లోని ఆమ్నేషియా ప‌బ్ లో బాలిక‌పై జ‌రిగిన గ్యాంగ్ రేప్ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన జూబ్లీ హిల్స్‌ పోలీసులు నిందితుల కోసం వేట సాగిస్తున్నారు. ఈ క్రమంలో బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డార‌న్న ఆరోప‌ణ‌ల‌తో తెలంగాణ వ‌క్ఫ్ బోర్డు చైర్మ‌న్ మ‌సివుల్లా ఖాన్ కుమారుడు మ‌హ్మ‌ద్ ఖాద‌ర్ ఖాన్‌ను, మరో బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

ఈ కేసులో నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ బీజేపీ శ్రేణులు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో బీజేపీ శ్రేణులు పోలీస్ స్టేష‌న్‌లోకి చొచ్చుకెళ్ల‌డంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. అయితే అప్ప‌టికే కేసుపై దృష్టి సారించిన పోలీసులు నిందితుల క‌ద‌లిక‌ల‌పై నిఘా పెట్టారు. ఈ కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న మ‌హ్మ‌ద్ ఖాద‌ర్ ఖాన్ హైద‌రాబాద్ శివారులో ఉన్న‌ట్లు గుర్తించిన పోలీసులు అత‌డితో పాటు మ‌రో మైన‌ర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.
Hyderabad
Gang Rape
Telangana State Waqf Board
Jubilee Hills PS

More Telugu News