Chandrababu: నేడు ప్రపంచ సైకిల్ దినోత్సవం... చంద్రబాబు ఏమన్నారంటే...!

Chandrababu comments on world bicycle day
  • ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
  • సైకిల్ ప్రయాణం ఆరోగ్యం, ఆనందదాయకమని వివరణ
  • సైకిల్ సామాన్యుడి అవసరమని వ్యాఖ్యలు
  • ఇప్పుడు అందరి మదిలో మళ్లీ సైకిల్ అని వెల్లడి
నేడు (జూన్ 3) ప్రపంచ సైకిల్ దినోత్సవం. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సోషల్ మీడియాలో స్పందించారు. ప్రజలందరికీ ప్రపంచ సైకిల్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సైకిల్ తో ప్రయాణం వల్ల ఆరోగ్యం, ఆనందం లభిస్తాయని పేర్కొన్నారు. సైకిల్ సామాన్యుడి అవసరం, ఆసరా అని నొక్కిచెప్పారు. సైకిల్ గుర్తుతోనే అభివృద్ధి, సంక్షేమం అని ఉద్ఘాటించారు. అందుకే ఇప్పుడు అందరి మదిలో మళ్లీ సైకిల్ అని వ్యాఖ్యానించారు.
Chandrababu
World Bicycle Day
Cycle
TDP
Andhra Pradesh

More Telugu News