విశాఖపట్టణంలోని షిప్పింగ్ గోదాములో భారీ అగ్నిప్రమాదం.. తానా పంపిన రూ.11 కోట్ల కొవిడ్ సామగ్రి బూడిద
- పెదగంట్యాడలోని శ్రావణి షిప్పింగ్ గోదాములో ప్రమాదం
- కరోనా సమయంలో తెలుగు ప్రజలకు తానా పంపిన వితరణ
- కెనడా నుంచి రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా దిగుమతి
- పంపిణీకి ఏర్పాట్లు చేస్తుండగానే ప్రమాదం
రాష్ట్రంలోని ఆరోగ్య కేంద్రాలకు గవర్నర్ చేతుల మీదుగా వీటిని పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండగానే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సరుకు తీసుకురావడానికి, ఇక్కడ గోదాములో భద్రపరిచేందుకు అవసరమైన అనుమతుల్లో జాప్యం వల్లే పంపిణీ ఆలస్యమైందని రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర చైర్మన్ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. అగ్ని ప్రమాదంలో సామగ్రి కాలి బూడిదైన విషయాన్ని తానా దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. కాగా, ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.