మైనారిటీల్లో ఒక్కొక్కరికీ ముగ్గురు భార్యలు..20 మంది పిల్లలు..: బీహార్ మంత్రి బబ్లూ
- బీహార్ లో వేగంగా పెరిగిపోతున్న మైనారిటీ జనాభా
- బంగ్లాదేశీ ముస్లింలు, రోహింగ్యాలను కూడా లెక్కించాల్సిందే
- కులాల వారీ గణనతోనే అది బయటపడుతుంది
- బీహార్ కేబినెట్ మంత్రి బబ్లూ డిమాండ్
‘‘ముస్లిం కమ్యూనిటీకి చెందిన కొందరికి ముగ్గురు భార్యలు, 15-20 మంది వరకు పిల్లలు ఉన్నారు. వారు జనాభా లెక్కల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. జనాభా లెక్కల్లోకి రాకూడదన్నది వారి ఆలోచన. వారిని కూడా లెక్కల్లోకి తీసుకోవాల్సిందే. అప్పుడే బీహార్ లో మైనారిటీ జనాభా ఎంత వేగంగా పెరుగుతుందో తెలుస్తుంది’’ అని నీరజ్ కుమార్ బబ్లూ డిమాండ్ చేశారు.
గడిచిన కొన్ని సంవత్సరాల్లో బీహార్ లో ముస్లింల జనాభా చాలా వేగంగా పెరిగినట్టు బబ్లూ చెప్పారు. వారి జనాభా ఎంత వేగంగా పెరిగిందో కులాల వారీ జనగణనతో తేలిపోతుందన్నారు.