Gas: వంట గ్యాస్ పై ఇక సబ్సిడీ లేదు... సిలిండర్ ధరను వినియోగదారుడే పూర్తిగా భరించాలి!

  • వంట గ్యాస్ సిలిండర్ పై కేంద్రం కీలక నిర్ణయం
  • ఇకపై సబ్సిడీ ఇవ్వరాదని నిర్ణయం
  • ఉజ్వల పథకం లబ్దిదారులకు మాత్రమే సబ్సిడీ పరిమితం
  • దేశంలో రూ.1000 దాటిన సిలిండర్ ధర 
Center revokes subsidy on gas cylinder

వంట గ్యాస్ సిలిండర్ల అంశంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ పై ఇప్పటివరకు అందిస్తున్న రాయితీని నిలిపివేసింది. ఇకపై వంట గ్యాస్ సిలిండర్ ధర ఎంతుంటే అంత వినియోగదారుడే పూర్తి ధరను భరించాల్సి ఉంటుంది. ఈ మేరకు చమురు శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ తెలిపారు. ఇకమీదట ఉజ్వల పథకం లబ్దిదారులకు మాత్రమే గ్యాస్ పై సబ్సిడీ లభిస్తుందని వెల్లడించారు. ఉజ్వల పథకంలో భాగంగా లబ్దిదారులకు సాలీనా 12 సిలిండర్లు అందజేస్తారు. ఒక్కో సిలిండర్ కు రూ.200 రాయితీ ఇస్తున్నారు. 

అయితే, సాధారణ వినియోగదారులకు వంట గ్యాస్ పై రాయితీ ఎత్తివేసిన నేపథ్యంలో, సామాన్యుడికి ఇది శరాఘాతం వంటి నిర్ణయమే అని చెప్పాలి. ఇప్పటికే దేశంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ.1000 దాటింది. ఇప్పుడు ప్రభుత్వం రాయితీ తొలగించిన నేపథ్యంలో, వినియోగదారుడిపైనే పూర్తి భారం పడనుంది.

More Telugu News