'ది వారియర్' సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఖరారు!
- రామ్ హీరోగా రూపొందిన 'ది వారియర్'
- ఫస్టు టైమ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న రామ్
- తెలుగు .. తమిళ భాషల్లో నిర్మితమైన సినిమా
- జులై 14వ తేదీన విడుదల
తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం 12:07 నిమిషాలకు సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నట్టు చెబుతూ, అధికారిక పోస్టర్ ను వదిలారు. 'దడ దడ' అంటూ నాయకానాయికల మధ్య ఈ పాట కొనసాగనుంది.
రామ్ సరసన నాయిగా కృతి శెట్టి అలరించనుంది. రామ్ మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. తెలుగుతో పాటు తమిళంలోను జులై 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.