Poorna: పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ పూర్ణ!

Actress Poorna getting marriage
  • యూఏఈ బిజినెస్ మేన్ అసిఫ్ అలీని పెళ్లాడనున్న పూర్ణ
  • ఎంగేజ్ మెంట్ చేసుకున్న పూర్ణ, అలీ
  • జీవితంలో మరో భాగంలోకి అడుగుపెడుతున్నానన్న పూర్ణ
సినీ నటి పూర్ణ తెలుగు సినీ పరిశ్రమలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. మంచి పాత్రలను పోషిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని ఆమె చూరగొంది. నటిగానే కాకుండా, బుల్లి తెరపై 'ఢీ', 'జబర్దస్త్' తదితర షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. 

ఇదిలావుంచితే, తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇటీవలే సోషల్ మీడియాలో ఆమె ప్రకటించింది. తాజాగా తన కాబోయే భర్త షానిద్ అసిఫ్ అలీతో ఆమె ఎంగేజ్ మెంట్ జరిగింది. ఆసిఫ్ అలీ యూఏఈ బిజినెస్ మేన్. జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ను ఆయన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ.. 'తన కుటుంబ ఆశీర్వాదాలతో తన జీవితంలోని మరో భాగంలోకి అడుగుపెడుతున్నా' అని చెప్పారు.
Poorna
Tollywood
Marriage

More Telugu News