Singapore: సింగపూర్ లో భారత స్పైడర్ మ్యాన్ కు భారీ జరిమానా

Indian origin Spiderman fined for flouting Covid rules in Singapore
  • కోట్ర వెంకట సాయి రోహన కృష్ణకు రూ.2.24 లక్షల జరిమానా
  • నిబంధనలు ఉల్లంఘించి న్యూ ఇయర్ వేడుకలు
  • నిందితుడిగా ప్రకటించిన కోర్టు
భారత సంతతికి చెందిన స్పైడర్ మ్యాన్ కోట్ర వెంకట సాయి రోహన కృష్ణకు కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులో సింగపూర్ స్థానిక కోర్టు 4,000 సింగపూర్ డాలర్ల (రూ.2.24 లక్షలు) జరిమానా విధించింది. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా రోహనకృష్ణ స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్ వేసుకున్నందుకు ఒక అభియోగం.. ఐదుగురికి మించి ఎక్కువ మంది ఒకే చోట గుమికూడినందుకు మరో అభియోగంలో ఆయనను దోషిగా న్యాయస్థానం తేల్చింది.

క్లార్క్ క్వే వద్ద తొమ్మిది మంది బృందంతో కలసి చేసుకున్న పార్టీలో రోహనకృష్ణ కూడా ఉన్నాడు. ఐదుగురు కంటే ఎక్కువ మంది ఒక చోట ఉండకూదన్నది నిబంధన. రోహన కృష్ణ స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్ ధరించి, ఎక్కువ మంది జన సందోహం మధ్య గడుపుతూ ఆ వీడియోలను తన యూట్యూబ్ చానల్ లో పెట్టాడు. దీంతో కొవిడ్ 19 భద్రతా మార్గదర్శకాలను ఉల్లంఘించినట్టు కేసు నమోదు చేశారు. 

వేడుకలకు వచ్చిన వారిని ఇంటర్వ్యూ చేసి వీడియోలను తన యూట్యూబ్ చానల్ లో పోస్ట్ చేయాలన్నది రోహన కృష్ణ ఆలోచన. అతడికి ఇద్దరు చైనా మిత్రులు ఈ విషయంలో సహకారం అందించారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్ ధరించడమే కాకుండా.. రాత్రంతా దానితోనే ఉండడం, ముఖానికి మాస్క్ పెట్టుకోకపోవడాన్ని డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయమూర్తికి నివేదించారు. 4.22 నిమిషాల తన యూట్యూబ్ వీడియోలో.. ‘ఈ నూతన సంవత్సర వేడుకలు చట్టానికి చెంప దెబ్బ’ అంటూ రోహన కృష్ణ కొట్టిన డైలాగ్ ను సైతం వినిపించారు.
Singapore
Indian Railways
Spiderman
voilation

More Telugu News