Salman Khan: త్వరలో హిందీ సినిమా సెట్స్ పైకి వెంకీ!

Venkatesh in Salman Movie
  • సల్మాన్ హీరోగా 'కభీ ఈద్ కభీ దివాలి'
  • కథానాయికగా పూజ హెగ్డే 
  • కీలకమైన పాత్రకి వెంకీ గ్రీన్ సిగ్నల్ 
  • ప్రత్యేక పాత్రలో కనిపించనున్న జగపతిబాబు
సల్మాన్ ఖాన్ తాజా చిత్రంగా 'కభీ ఈద్ కభీ దివాలి' సినిమా రూపొందుతోంది. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వెంకటేశ్ కీలకమైన పాత్రను పోషించనున్నారు. జూన్ 10వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగులో వెంకటేశ్ పాల్గొంటారు. 'ఆచార్య' సినిమా కోసం 'ధర్మస్థలి' టెంపుల్ సెట్ వేసిన సంగతి తెలిసిందే. 

చిరంజీవి సొంత స్థలంలో వేసిన ఈ సెట్ ను అలాగే ఉంచారు. చిరంజీవి ఫ్యామిలీతో సల్మాన్ కి ఎంతో సాన్నిహిత్యం ఉంది. అందువలన సల్మాన్ ఇక్కడ షూటింగు చేసుకోవడానికి చిరంజీవి సంతోషంగా అంగీకరించి ఉంటారు. ఇక్కడ చిత్రీకరించబోయే సీన్స్ లోనే వెంకటేశ్ జాయిన్ కానున్నట్టుగా చెబుతున్నారు. 

సల్మాన్ కీ .. వెంకటేశ్ కి మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. అందువలన ఆయన అడగ్గానే ఈ సినిమాలో చేయడానికి వెంకటేశ్ అంగీకరించారట. ఇక ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. గతంలో సల్మాన్ తో నటించే ఛాన్స్ ను మిస్ చేసుకున్న జగ్గూ భాయ్ ఈ సారి వచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకోవడం లేదు. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే సందడి చేయనున్న సంగతి తెలిసిందే.
Salman Khan
Venkatesh Daggubati
Jagapathi Babu

More Telugu News