China: నేను పురుషుడిగా ఉండాలని కోరుకుంటున్నాను.. చైనీస్ టెన్నిస్ ప్లేయర్

  • రుతు సంబంధిత నొప్పితో ఆడలేకపోయిన క్విన్ వెన్ జెంగ్
  • రెండో సెట్ నుంచి అర్థాంతరంగా బయటకు
  • మహిళలకే ఈ ఇబ్బంది అంటూ క్రీడాకారిణి ఆవేదన
Wish I can be a man Chinas Qinwen Zheng

రుతు సంబంధిత నొప్పి కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకోవాల్సి రావడంపై చైనా క్రీడాకారిణి క్విన్ వెన్ జెంగ్ విచారం వ్యక్తం చేసింది. తొలి సెట్ లో ఆమె బాగానే ఆడింది. కానీ రెండో సెట్ లో పొత్తి కడుపు భాగంలో తీవ్రంగా నొప్పి రావడంతో మెడికల్ టైమ్ అవుట్ ఆప్షన్ వినియోగించుకుంది. అప్పటికీ ఉపశమనం లేకపోవడంతో మ్యాచ్ ను ప్రపంచ నంబర్ 1, పోలండ్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ కు కోల్పోయింది. రెండో సెట్ లో ఆమె కుడి కాలు కూడా పట్టేసింది.  

‘‘అవును కాలు భారంగా మారిపోయింది. కానీ, కడుపు నొప్పి కంటే ఇది తక్కువే. నేను మ్యాచ్ ఆడలేను. కడుపులో చాలా నొప్పిగా ఉంది’’ అని ప్రపంచ టెన్నిస్ లో  74వ స్థానంలో ఉన్న జెంగ్ పేర్కొంది. రుతు సంబంధిత నొప్పి గురించి మాట్లాడుతూ.. మహిళలకే ఈ ఇబ్బంది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘కోర్టులో పురుషుడిగా ఉండాలని అనుకున్నాను. కానీ, ఆ సమయంలో అది సాధ్యం కాలేదు. అందుకే నేను పురుషుడిగా ఉండాలని కోరుకుంటున్నాను. అప్పుడు అయితే ఈ ఇబ్బంది ఉండదుగా’’ అని జెంగ్ పేర్కొంది.

More Telugu News