Jos Buttler: జోస్ బట్లర్ జెర్సీ నిండా సహచరుల ఆటోగ్రాఫ్ లే!

R Ashwin signs Jos Buttler jersey in dressing room after Rajasthan end up as IPL 2022 runners up
  • రాజస్థాన్ సభ్యుల సంతకాలు తీసుకున్న బట్లర్
  • ఒకదానిపై ఒకటి రెండు జెర్సీలు వేసుకున్న ఆర్ఆర్ ఓపెనర్
  • రెండింటిపైనా సంతకాల సేకరణ
  • ఫైనల్స్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో సందడి
ఐపీఎల్ ఫైనల్స్ మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) సభ్యులు సందడి చేశారు. ఈ సీజన్ మొత్తంలో బ్యాట్ తో మెరుగైన ప్రదర్శన చేసి రాజస్థాన్ జట్టును రన్నరప్ గా నిలబెట్టడంలో ఓపెనర్ జోస్ బట్లర్ పాత్ర ఎంతో ముఖ్యమని చెప్పుకోవాలి. ఫైనల్స్ లో తక్కువ స్కోరుకే అవుటైన తర్వాత అతడు అసహనంతో హెల్మెట్, గ్లోవ్స్ విసిరేస్తూ వెళ్లిపోవడం చూసే ఉంటారు. కానీ, ఆ అసహనం కొద్ది సేపే. ఆ తర్వాత జట్టు సభ్యులు అందరూ తెగ అల్లరి చేసేశారు.

ముఖ్యంగా జోస్ బట్లర్ జట్టు సభ్యుల ఆటోగ్రాఫ్ కోసం పోటీపడ్డాడు. అందరి దగ్గరకు వెళుతూ పెన్ను ఇచ్చి మరీ తాను ధరించిన ఆర్ఆర్ జెర్సీపై ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఒకటి కాదు. ఒకదానిపైన మరొకటి జెర్సీ వేసుకోగా.. రెండింటిపై రవిచంద్రన్ అశ్విన్ సంతకం చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిపోయింది. ఈ సీజన్ మొత్తానికి 863 పరుగులు చేసిన జోస్ బట్లర్ ఆరెంజ్ క్యాప్ అందుకోవడం తెలిసిందే. 


Jos Buttler
R Ashwin
Rajasthan
autograph

More Telugu News