Venkatesh Daggubati: 'ఎఫ్ 3' సినిమాను పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు: వరుణ్ తేజ్

F3 movie Block Buster Fun Ride Celabrations
  • 'ఎఫ్ 3' సక్సెస్ సెలబ్రేషన్స్ స్టేజ్ పై వరుణ్
  • రెస్పాన్స్ గొప్పగా ఉందంటూ వివరణ 
  • సీనియర్స్ తో నటించే ఛాన్స్ రావడం పట్ల ఆనందం
  • మళ్లీ హిట్ ఇచ్చినందుకు అనిల్ కి థ్యాంక్స్ అంటూ వ్యాఖ్య  
'ఎఫ్ 2' సినిమాలో వెంకటేశ్ - రాజేంద్రప్రసాద్ లతో సమానంగా కామెడీని పండించడానికి వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు. 'ఎఫ్ 3' సినిమాలో సునీల్ .. అలీ కూడా యాడ్ కావడంతో ఆయన మరింత కసరత్తు చేయవలసి వచ్చింది. 'ఎఫ్ 2' మాదిరిగానే 'ఎఫ్ 3' కూడా వరుణ్ తేజ్ కి మంచి పేరును తీసుకొచ్చింది.

ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ఈ సినిమాని ఇంతగా సక్సెస్ చేసినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతున్నాను. చిన్న పిల్లలకి కనెక్ట్ అయ్యే సినిమాలు ఈ మధ్య కాలంలో రాలేదు. ఈ సినిమా చిన్న పిల్లలకు కూడా కనెక్ట్ కావడం ఆనందంగా ఉంది. 

నాకు ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు అనిల్ రావిపూడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సినిమా మొదటి నుంచి చివరివరకూ ఆడియన్స్ నవ్వుతూనే ఉన్నారు. ఇక్కడున్న మా టీమ్ కష్టమే అందుకు కారణం. వెంకటేశ్ .. రాజేంద్ర ప్రసాద్ గారి వంటి సీనియర్ స్టార్స్ తో కలిసి నటించే ఛాన్స్ రావడం ఆనందంగా ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.

More Telugu News

Venkatesh Daggubati
Varun Tej
Anil Ravipudi
F3 Movie