అందుకే నా ముఖం మీకు చూపించాను: రాజేంద్రప్రసాద్

F3 movie update
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'ఎఫ్ 3' సినిమా, ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ను కొంతసేపటి క్రితం నిర్వహించారు. ఈ వేదికపై రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ .. "ఈ సినిమా హిట్ కాకపోతే నా ముఖం మళ్లీ మీకు చూపించనని ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజునే చెప్పాను. 

ఈ సినిమా హిట్ అయింది కనుకనే .. మళ్లీ మీ ముందుకు వచ్చాను. మామూలు హిట్ కాదు  .. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సోమవారం రోజున కూడా ఈ సినిమా అన్ని చోట్లా ఫుల్స్ పడ్డాయి. దీనిని హిట్ కాకపోతే ఏమంటారు? ఆ రోజున నేను అంత ధైర్యంగా మాట్లాడానికి కారణాలు రెండు .. ఒకటి నవ్వు .. రెండు మీరు. 

ఈ సినిమా రిలీజ్ రోజున నాకు ప్రపంచం నలు మూలాల నుంచి కాల్స్ వచ్చాయి. నాకు మళ్లీ 'మాయలోడు' రోజులు గుర్తుకు వచ్చాయి. 45 సంవత్సరాలుగా నవ్వునే నమ్ముకున్నాను. ఆ నవ్వే మళ్లీ నాకు మరో హిట్ ను తెచ్చిపెట్టింది. ఇంతటి సక్సెస్ కి కారణమైన అనిల్ రావిపూడికి హ్యాట్సాఫ్ చెబుతున్నాను" అన్నారు.
Go Back to Shorts
Venkatesh Daggubati
Varun Tej
Rajendra prasad
F3 Movie

More Telugu News