నేను ప్రేమిస్తున్న వ్యక్తి మనసులో ఏముందో నాకు తెలియదు: అనుపమ పరమేశ్వరన్
- ప్రేమ వివాహమే చేసుకుంటానంటున్న అనుపమ
- ప్రేమ వివాహంపై తనకు మంచి అభిప్రాయం ఉందని వెల్లడి
- ప్రేమ వివాహం చేసుకున్న వారిని చూస్తే ముచ్చటేస్తుందని కామెంట్
తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని అనుపమ తెలిపింది. తాను ప్రేమలో ఉన్నానని... కానీ అవతలి వ్యక్తి తనను ప్రేమిస్తున్నాడా? లేదా? అనే విషయం తనకు తెలియదని... ఒక రకంగా చెప్పాలంటే తనది వన్ సైడ్ లవ్ అని చెప్పింది. ప్రేమ వివాహంపై తనకు మంచి అభిప్రాయం ఉందని... ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలను చూస్తే చాలా ముచ్చటేస్తుందని తెలిపింది. తనకు ప్రేమ వివాహమే చేసుకోవాలని ఉందని... ఈ విషయం తన తల్లిదండ్రులకు కూడా తెలుసని చెప్పింది.