Nagababu: జూన్ 1 నుంచి ఉత్తరాంధ్రలో పర్యటించనున్న నాగబాబు

  • ఉత్తరాంధ్రలో నాగబాబు పర్యటన షెడ్యూల్ విడుదల
  • శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటన
  • పవన్ ఆలోచనా విధానంపై పార్టీ శ్రేణులకు వివరించనున్న నాగబాబు
  • పలువురు నేతలకు పార్టీలోకి ఆహ్వానం పలకనున్న వైనం
Nagababu will tour in North Andhra

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన జూన్ 1న ప్రారంభం కానుంది. తొలుత శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు. జూన్ 2న విజయనగరం జిల్లాలో, జూన్ 3న విశాఖ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నాగబాబు పర్యటన కొనసాగనుంది. 

తన పర్యటన సందర్భంగా నాగబాబు ఉత్తరాంధ్ర జనసేన ముఖ్య నేతలు, జిల్లా కమిటీ నేతలు, నియోజకవర్గ కమిటీ నేతలు, వివిధ విభాగాల కమిటీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారని తెలుస్తోంది. జనసేనాని పవన్ కల్యాణ్ ఆలోచనా విధానం, పార్టీ భవిష్యత్ కార్యాచరణను జనసేన శ్రేణులకు నాగబాబు వివరించనున్నారు. అంతేకాకుండా, పార్టీ అభివృద్ధికి శ్రేణుల నుంచి వచ్చే సలహాలను స్వీకరించనున్నారు. 

తన పర్యటనలో భాగంగా, జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్న పలువురు నేతలను పార్టీలోకి ఆహ్వానించనున్నారు. వచ్చే నెల మొదటి వారంలో నాగబాబు వస్తుండడంతో ఉత్తరాంధ్రలో సందడి మొదలైంది. నాగబాబు పర్యటన కోసం జనసేన నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

More Telugu News