Singeetam Srinivasa Rao: లెజండరీ డైరెక్టర్‌ ఇంట విషాదం.. సింగీతం స‌తీమ‌ణి క‌న్నుమూత‌

tollywood director Singeetam Srinivasa Rao wife lakshmi kalyani is no more
  • 1960లో సింగీతంతో ల‌క్ష్మీ క‌ల్యాణి వివాహం
  • 62 ఏళ్ల పాటు సాగిన సింగీతం దంపతుల ప్ర‌యాణం
  • అనారోగ్య కార‌ణాల‌తో మృతి చెందిన ల‌క్ష్మీ క‌ల్యాణి
  • సోషల్‌ మీడియా వేదిక‌గా స్వ‌యంగా వెల్ల‌డించిన సింగీతం
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం నెలకొంది. సింగీతం సతీమణి లక్ష్మీ కల్యాణి శ‌నివారం తుది శ్వాస విడిచారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె శ‌నివారం రాత్రి చెన్నైలో మృతి చెందారు. ‘నా భార్య లక్ష్మీ కల్యాణి శనివారం రాత్రి 9.10గంటలకు తుదిశ్వాస విడిచింది. 62 ఏళ్ల సుదీర్ఘమైన మా భాగస్వామ్యానికి ముగింపు పడింది’అని సింగీతం సోషల్‌ మీడియా వేదిక‌గా త‌న భార్య మ‌ర‌ణాన్ని ప్ర‌క‌టించారు.

1960లో సింగీతం శ్రీనివాసరావు, లక్ష్మీకల్యాణిల వివాహం జరిగింది. సింగీతం సీనీ కెరీర్‌లో ల‌క్ష్మీ క‌ల్యాణి కీలక పాత్ర పోషించారు. సినిమా స్క్రిప్ట్ ర‌చ‌న‌లో ల‌క్ష్మీక‌ల్యాణి ఆయనకు సహాయం చేసేవారు. ఈ కార‌ణంగానే సింగీతం త‌న స‌తీమ‌ణి గురించి ‘శ్రీకల్యాణీయం’అనే ఓ పుస్తకాన్ని రాశారు. ప్రస్తుతం సింగీతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రభాస్‌ నటించబోతున్న తాజా చిత్రం ‘ప్రాజెక్ట్‌ కే’ సినిమాకు తొలుత కన్సల్టెంట్ గా వ్యవహరించేందుకు ఒప్పుకున్నా.. ఆ తర్వాత  అనారోగ్య కారణాల వల్ల ఆయ‌న‌ తప్పుకున్నారు.
Singeetam Srinivasa Rao
Tollywood
Director
Singeetam

More Telugu News