పెరుగుతున్న యాక్టివ్ కేసులు.., దేశంలో కొత్తగా 2,828 కేసులు, 14 మంది మృతి
- దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 17,087
- కరోనా బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,035
- వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 13,81,764
ఇక శనివారం దేశంలో నమోదైన కేసులు, మరణాల విషయానికి వస్తే... శనివారం 4,74,309 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... 2,828 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 14 మంది మరణించారు. దీంతో ఇప్పటిదాకా కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,24, 586కు చేరింది. ఇక కరోనా బారిన పడిన వారిలో శనివారం 2,035 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.26 కోట్లను దాటింది. ఇదిలా ఉంటే.. శనివారం 13,81,764 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకోగా.. దేశంలో ఇప్పటిదాకా వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 193.28 కోట్లను దాటింది.