NTR: తెలుగు తెరపైకి నందమూరి వంశం నుంచి మరో వారసుడు.. ఫస్ట్ లుక్ విడుదల చేసిన బాలయ్య

  • బసవతారకరామ క్రియేషన్స్ స్థాపించిన నందమూరి జయకృష్ణ
  • హీరోగా పరిచయమవుతున్న నందమూరి చైతన్య కృష్ణ
  • ఫస్ట్ లుక్ విడుదల చేసిన బాలకృష్ణ
Nandamuri Chaitanya Krishna debut into Tollywood first look released

నందమూరి తారకరామారావు కుటుంబం నుంచి మరో నట వారసుడు వచ్చేస్తున్నాడు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ ఇటీవల ‘బసవతారకరామ క్రియేషన్స్’ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఇప్పుడీ సంస్థ.. జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ కథానాయకుడిగా ఓ సినిమాను రూపొందిస్తోంది. ఈ బ్యానర్ నుంచి ప్రొడక్షన్ నంబర్ 1గా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిన్న బాలకృష్ణ విడుదల చేశారు.

ఈ సందర్భంగా జయకృష్ణ మాట్లాడుతూ..  బసవతారకరామ క్రియేషన్స్ నుంచి తన కుమారుడిని కథానాయకుడిగా పరిచయం చేస్తుండడం ఆనందంగా ఉందన్నారు. సరికొత్త కథతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు  ‘రక్ష’, ‘జక్కన్న’ ఫేం దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని వివరాలను వెల్లడించనున్నట్టు జయకృష్ణ తెలిపారు.

More Telugu News