తెలంగాణలో విషాదం.. రథానికి విద్యుత్ తీగలు తగిలి ముగ్గురి మృతి!
- నల్గొండ జిల్లా కేతేపల్లిలో విషాదం
- కరెంట్ షాక్ తో ముగ్గురు అక్కడికక్కడే మృతి
- మరో నలుగురి పరిస్థితి విషాదం
మృతులను కేతేపల్లి గ్రామానికి చెందిన పొగాకు మునయ్య (43), రాజాబోయిన యాదయ్య (42), మక్కపల్లికి చెందిన కారు డ్రైవర్ దాసరి అంజి (20)గా గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో కేతేపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి.