Gujarat Titans: ఐపీఎల్ ప్లే ఆఫ్స్: రాజస్థాన్ పై టాస్ గెలిచిన గుజరాత్

Gujarat Titans won the toss in Qualifier one of IPL Play Offs
  • నేటి నుంచి ఐపీఎల్ ప్లే ఆఫ్స్
  • క్వాలిఫయర్-1లో గుజరాత్ వర్సెస్ రాజస్థాన్
  • గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరిక
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్ 15వ సీజన్ లో నేటి నుంచి ప్లే ఆఫ్స్ జరగనున్నాయి. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో జరిగే తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ పోరులో టాస్ గెలిచిన గుజరాత్ సారథి హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్స్ కు చేరుకుంటుంది. ఓడిన జట్టు రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.

కాగా, నేటి మ్యాచ్ కోసం గుజరాత్ జట్టులో ఒక మార్పు చేసినట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య వెల్లడించాడు. లాకీ ఫెర్గుసన్ స్థానంలో అల్జారీ జోసెఫ్ జట్టులోకి వచ్చాడని వివరించాడు. అటు, రాజస్థాన్ జట్టులో ఎలాంటి మార్పులు లేవని కెప్టెన్ సంజు శాంసన్ పేర్కొన్నాడు.

గుజరాత్ జట్టు...
హార్దిక్ పాండ్య (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా, శుభ్ మాన్ గిల్, మాథ్యూ వేడ్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిశోర్, యశ్ దయాళ్, అల్జారీ జోసెఫ్, మహ్మద్ షమీ.

రాజస్థాన్ జట్టు...
సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, షిమ్రోన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యజువేంద్ర చహల్, ఒబెద్ మెక్ కాయ్.


Gujarat Titans
Toss
Rajasthan Royals
Qualifier-1
Play Offs
IPL-15

More Telugu News