Venkatesh Daggubati: 'ఎఫ్ 3' హిట్ తమన్నాకు కూడా కీలకమే!

F3 movie update
  • 'ఎఫ్ 2'తో హిట్ అందుకున్న తమన్నా 
  • అప్పటి నుంచి అందని ద్రాక్షలా మారిన సక్సెస్ 
  • ఇందులో గ్లామర్ ఒలకబోసిన తమన్నా   
  • 'ఎఫ్ 3'పైనే ఆశలు పెట్టుకున్న ముద్దుగుమ్మ 
కొంతకాలంగా చూసుకుంటే తమన్నా సక్సెస్ గ్రాఫ్ అంతంత మాత్రంగానే ఉంది. 'ఎఫ్ 2' తరువాత తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లోనూ ఆమె కొన్ని సినిమాలు చేసింది. కానీ ఏ సినిమా కూడా ఆమె స్థాయికి తగిన హిట్ ఇవ్వలేకపోయింది. టాక్ పరంగా .. వసూళ్ల పరంగా 'ఎఫ్ 2'ను దాటుకుని ముందుకు వెళ్లలేకపోయింది.

హీరోయిన్ గా చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, అడపాదడపా స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా ఆమె వెనుకాడటం లేదు. ఇప్పుడు కూడా ఆమె సినిమాలు కొన్ని రిలీజ్ కి ఉన్నాయి. కానీ ఒక్క 'ఎఫ్ 3' సినిమాకి మినహాయించి ఏ సినిమాకి కూడా బజ్ లేదు.

'ఎఫ్ 3' సినిమా ఈ నెల 27వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలో మెహ్రీన్ .. సోనాల్ చౌహాన్ .. పూజ హెగ్డేకి మించి తమన్నా గ్లామర్ ఒలకబోసినట్టుగా పాటలను బట్టి తెలుస్తోంది. ఈ సినిమా తనకి మరికొంత మైలేజ్ ఇస్తుందని తమన్నా భావిస్తోంది. మరి ఆమె ఆశించినట్టుగా జరుగుతుందా? లేదా? అనేది చూడాలి.
Venkatesh Daggubati
Thamannah
Varun Tej
Mehreen
F3 Movie

More Telugu News