KTR: తెలంగాణకు మరో భారీ పెట్టుబడిని రాబట్టిన కేటీఆర్

KTR attracts another investment to Telangana in Davos
  • దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు
  • నిన్న స్విస్ రే బీమా సంస్థతో ఒప్పందం
  • నేడు అలియాక్సిస్ సంస్థతో చర్చలు
  • తెలంగాణలో ఆశీర్వాద్ పైప్స్ గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ మంత్రి కేటీఆర్ మరో భారీ పెట్టుబడిని సాధించారు. నిన్న స్విస్ రే బీమా సంస్థ హైదరాబాదులో కార్యాలయం ఏర్పాటుకు మొగ్గు చూపగా, నేడు ఆశీర్వాద్ పైప్స్ సంస్థ తెలంగాణలో గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

 ఈ యూనిట్ ఏర్పాటు వ్యయం రూ.500 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. ఆశీర్వాద్ పైప్ పరిశ్రమ ఏర్పాటుతో వందలాది ఉద్యోగాలు లభిస్తాయని తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

ఆశీర్వాద్ పైప్స్ మాతృసంస్థ 'అలియాక్సిస్' సీఎఫ్ఓ కోయెన్ స్టికర్ నేడు దావోస్ లో మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. అనేక అంశాల్లో చర్చల అనంతరం తెలంగాణలో గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
KTR
Investment
Aliaxis
Ashirvad Pipes
Davos
Telangana

More Telugu News