రేవంత్ రెడ్డి ఒక లుచ్చా: మంత్రి మల్లారెడ్డి
- రేవంత్, మల్లారెడ్డి మధ్య పేలుతున్న మాటల తూటాలు
- రేవంత్ ఒక బ్లాక్ మెయిలర్ అన్న మల్లారెడ్డి
- తన డబ్బుతోనే రేవంత్ కూతురి పెళ్లి చేశాడని వ్యాఖ్య
మల్కాజ్ గిరి ఎంపీ సీటు కోసం తనను బ్లాక్ మెయిల్ చేశాడని.. డబ్బుల కోసం డిమాండ్ చేశాడని చెప్పారు. డబ్బులు ఇవ్వకపోతే తన కాలేజీలను మూసేయిస్తానని రేవంత్ బ్లాక్ మెయిల్ చేశాడని ఆరోపించారు. రాహుల్ గాంధీని కూడా రేవంత్ బ్లాక్ మెయిల్ చేసే రోజు వస్తుందని అన్నారు. రేవంత్ రెడ్డి ఆయన కూతురి పెళ్లిని తన డబ్బులతోనే చేశాడని చెప్పారు.