Gt: ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు వర్షం అడ్డొస్తే పరిష్కారం ఏమిటి?

  • ప్లే ఆఫ్ దశలో రిజర్వ్ డే అంటూ లేదు
  • సూపర్ ఓవర్ ద్వారా విజేత ప్రకటన
  • అది కూడా వీలు కాకపోతే లీగ్ దశలో పాయింట్లే కీలకం
  • ఫైనల్ మ్యాచ్ కు మే 30న రిజర్వ్ డే
What will happen if rain washes out GT vs RR IPL 2022 Qualifier 1

నేటి నుంచి (24వ తేదీ) ఐపీఎల్ ప్లే ఆఫ్స్ (క్వాలిఫయర్ మ్యాచులు) మొదలు కానున్నాయి. రాత్రి 7.30 గంటలకు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. బుధవారం మూడు, నాలుగో స్థానాల్లో ఉన్న లక్నో, బెంగళూరు జట్లు ఈడెన్స్ గార్డ్సెన్ష్ లోనే తలపడతాయి. నేటి ప్లేఆఫ్ లో ఓడిన జట్టు.. రెండో ప్లే ఆఫ్ లో గెలిచిన జట్టుతో 27న పోటీ పడుతుంది. విజేత ఫైనల్ (29న) కు వెళుతుంది. 

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మంగళవారం సాయంత్రం కోల్ కతాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వర్షం కారణంగా ఆడే పరిస్థితి లేకపోతే.. రిజర్వ్ డే అంటూ లేదు. రెండు జట్ల మధ్య సూపర్ ఓవర్ జరుగుతుంది. దానిలో స్కోరు ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. ఒకవేళ సూపర్ ఓవర్ కు కూడా అవకాశం లేని పరిస్థితుల్లో.. రెండు జట్లలో ఒకదానిని లీగ్ దశలో చూపించిన ప్రతిభ ఆధారంగా ముందుకు ప్రమోట్ చేస్తారు.  మూడు ప్లే ఆఫ్ మ్యాచ్ లకు ఇదే నిబంధన అమలవుతుంది. వేటికీ రిజర్వ్ డే నిర్ణయించలేదు.

ఇక 29వ తేదీ జరిగే ఫైనల్ మ్యాచ్ కు వర్షం కారణంగా ఏవైనా అంతరాయం ఏర్పడితే కనుక.. 30వ తేదీ నిర్వహిస్తారు. ప్లే ఆఫ్స్ లో వాతావరణం అనుకూలించకపోతే 5 ఓవర్లకు కుదించి నిర్వహించొచ్చని నిబంధనలు చెబుతున్నాయి. కానీ, దీన్ని అమలు చేసే అవకాశం లేదని తెలుస్తోంది. ఫైనల్ మ్యాచ్ కు ఐదు గంటల 20 నిమిషాల సమయం ఇచ్చారు. ఇందులో అననుకూల వాతావరణం దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన రెండు గంటల అదనపు సమయం కూడా ఉంది.

More Telugu News