'సలార్' షూటింగ్ రెండో షెడ్యూల్ తొలిరోజే షాక్.. ప్రభాస్ పిక్స్ లీక్!
- ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో 'సలార్'
- రెండో షెడ్యూల్ షూటింగ్ ఈరోజు ప్రారంభం
- ప్రభాస్, సెట్ ఫొటోలు లీక్ అయిన వైనం
ప్రభాస్ ఓ అమ్మాయితో మాట్లాడుతున్న ఫొటో, కుర్చీలో కూర్చున్న ఫొటో, సెట్ కు సంబంధించిన ఒక ఫొటో లీక్ అయ్యాయి. సెట్ కు సంబంధించిన ఫొటోను చూస్తే సినిమా చాలా వయొలెంట్ గా ఉండే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ నటిస్తోంది. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. 'కేజీఎఫ్'ను నిర్మించిన హంబాలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది.

