'శేఖర్' సినిమాపై స్టే ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది: రాజశేఖర్
- ఆర్థిక వివాదంలో 'శేఖర్' చిత్రం
- కోర్టును ఆశ్రయించిన ఫైనాన్షియర్
- సినిమా ప్రదర్శనలు నిలిపివేత
- స్టే తొలగిపోయిందన్న రాజశేఖర్
ఏదేమైనా వీకెండ్ లో 'శేఖర్' చిత్రప్రదర్శనలు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడిందని రాజశేఖర్ వివరించారు. అయితే, శేఖర్ చిత్రం తగిన రీతిలో ప్రజాదరణకు నోచుకుంటుందని తాను ముందే చెప్పానని తెలిపారు. భవిష్యత్ లో 'శేఖర్' చిత్ర ప్రదర్శనపై నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వారికి తాము మద్దతుగా నిలుస్తామని రాజశేఖర్ వెల్లడించారు. తమ వెన్నంటే ఉన్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వివరించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు.