తెలంగాణలో తాజాగా 29 మందికి కరోనా

Telanganaa corona updates
  • గత 24 గంటల్లో 8,260 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 24 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 39 మంది
  • ఇంకా 397 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా రోజువారీ కేసులో కనిష్ఠ స్థాయిలో నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 8,260 కరోనా పరీక్షలు నిర్వహించగా, 29 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 24 కొత్త కేసులు వెల్లడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 3, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 1, ఆదిలాబాద్ జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. అదే సమయంలో 39 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనా మరణాలేవీ సంభవించలేదు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు 7,92,871 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,88,363 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 397 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.
Go Back to Shorts
Telangana
Corona Virus
Updates
Today Cases

More Telugu News