అది ఫేక్ మెసేజ్... ఎస్ బీఐ ఖాతాదారులను హెచ్చరించిన కేంద్రం
- మీ ఖాతా బ్లాక్ అయిందంటూ మెసేజ్
- కీలక వివరాలతో అప్ డేట్ చేయించుకోవాలని సందేశం
- మోసపూరిత సందేశం అని కేంద్రం వెల్లడి
- ఖాతా వివరాలు పంచుకోవద్దని స్పష్టీకరణ
ఎస్ బీఐ తన ఖాతాదారులకు ఎప్పుడూ ఇలాంటి సందేశాలు పంపదని, ఒకవేళ మీ ఫోన్లకు, మెయిల్ కు ఈ తరహా సందేశాలు వస్తే అప్రమత్తతో వ్యవహరించాలని సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకు ఖాతా వివరాలను పంచుకోవద్దని హెచ్చరించింది. ఈ ఫేక్ మెసేజ్ పై ఎవరైనా ఎస్ బీఐ దృష్టికి తీసుకెళ్లాలనుకుంటే [email protected] కు మెయిల్ చేయాలని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం పేర్కొంది.