Cricket: ఆర్సీబీ జెర్సీలో ముంబై ఆటగాడు.. ఫొటో పెట్టిన ఆర్సీబీ టీం.. అసలేమైందంటే..

RCB Thanks Tim David For Heroics Against Delhi
  • నిన్న ఢిల్లీపై గెలిచిన ముంబై
  • వీరోచిత ఇన్నింగ్స్ తో గెలిపించిన టిమ్ డేవిడ్
  • ముంబై విజయంతో ప్లే ఆఫ్స్ కు ఆర్సీబీ
  • తమ మాజీ ఆటగాడు టిమ్ కు ఆర్సీబీ థ్యాంక్స్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే.. ముంబై, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో ముంబై గెలవాలి, ఢిల్లీ ఓడాలి. ఇదే సమీకరణం.. ఆర్సీబీ ఫ్యాన్స్ ముంబై గెలవాలని కోరుకునేలా చేసింది. వాస్తవానికి నిన్నటి మ్యాచ్ లో కొంచెం అటూ ఇటైనా ముంబై ఓడేదే. కానీ, టిమ్ డేవిడ్ రూపంలో బెంగళూరుకు లక్ కలిసొచ్చింది. 11 బంతుల్లోనే 34 పరుగులు చేసిన అతడి మెరుపులతో ముంబై గెలిచింది.. ఆర్సీబీ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లింది. 

ఇంకేముంది, ఆర్సీబీ యాజమాన్యం టిమ్ కు కృతజ్ఞతలు తెలిపింది. ‘‘మేం నిన్ను ప్రేమిస్తున్నాం టిమ్. నువ్వు బాగా ఆడుతున్నావు. నువ్వు ఇలాగే ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం’’ అంటూ ఆర్సీబీ జెర్సీలో ఉన్న టిమ్ డేవిడ్ ఫొటోను పోస్ట్ చేసింది. ముంబై ఆటగాడు కదా.. ఆర్సీబీ జెర్సీ ఏంటని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఏం లేదు.. ఇంతకుముందు టిమ్ డేవిడ్ బెంగళూరు తరఫున కూడా ఐపీఎల్ ఆడాడు. గత ఏడాది అతడిని బెంగళూరు తీసుకున్నా.. బరిలోకి దిగలేదు. ఈ నేపథ్యంలోనే అతడికి థ్యాంక్స్ చెబుతూ ఆర్సీబీ జెర్సీలో ఉన్న టిమ్ ఫొటోను బెంగళూరు పోస్ట్ చేసింది.

More Telugu News

Cricket
IPL
Mumbai Indians
Tim David
Royal Challengers Bangalore