Chiranjeevi: హోట‌ల్‌లో చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్ అభిమానుల భేటీ

mega fans meet in vijayawada
  • విజ‌య‌వాడ‌లోని ముర‌ళీ ఫార్చున్ హోట‌ల్ లో భేటీ
  • జ‌న‌సేన పార్టీకి మ‌ద్ద‌తుగా నిలిచే అంశంపై ప్ర‌ధానంగా చ‌ర్చ
  • పార్టీని బ‌లోపేతం చేయ‌డంపై నిర్ణ‌యాలు తీసుకునే ఛాన్స్
విజ‌య‌వాడ‌లో చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్ అభిమానులు స‌మావేశం అయ్యారు. ముర‌ళీ ఫార్చున్ హోట‌ల్ లో జ‌రుగుతోన్న ఈ స‌మావేశంలో ఏపీలోని అన్ని జిల్లాల నుంచి ప‌రిమిత సంఖ్య‌లో మెగా అభిమానులు పాల్గొన్నారు. జ‌న‌సేన పార్టీకి మ‌ద్ద‌తుగా నిలిచే అంశంపై ప్ర‌ధానంగా చ‌ర్చిస్తున్నారు. 

ఏపీలో ముగ్గురు హీరోల అభిమానులు క‌లిసి సంయుక్తంగా ప‌నిచేసి, జ‌న‌సేన పార్టీని బ‌లోపేతం చేయ‌డం, సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డం వంటి అంశాల‌పై చ‌ర్చించి, ప్ర‌ణాళిక వేసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.
Chiranjeevi
Ramcharan
Pawan Kalyan
Janasena

More Telugu News