Ramcharan: తార‌క్ బ‌ర్త్ డే స్పెషల్‌గా.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను హ‌త్తుకున్న ఫొటో పోస్ట్ చేసిన రామ్ చ‌ర‌ణ్

  • 'సోద‌రుడు, స‌హ‌చ‌ర న‌టుడు, మిత్రుడు' అంటూ సంబోధించిన చెర్రీ
  • త‌మ‌ అనుబంధాన్ని స్ప‌ష్టంగా నిర్వ‌చించేందుకు స‌రైన‌ ప‌దాలు లేవ‌ని వ్యాఖ్య‌
  • త‌మ‌ మ‌ధ్య ఉన్న‌ మధురస్మృతులను ఎల్ల‌ప్పుడూ గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటానని ట్వీట్
I dont think words can difine who you are to me tarak

సినీన‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ ఈ రోజు పుట్టిన‌రోజు వేడుక జ‌రుపుకుంటున్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపాడు. అలాగే, తాను జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను హ‌త్తుకోగా తీసిన‌ ఫొటోను ఆయ‌న పోస్ట్ చేశాడు.  

                        
''సోద‌రుడు, స‌హ‌చ‌ర న‌టుడు, మిత్రుడు... మ‌న మ‌ధ్య ఉన్న అనుబంధాన్ని స్ప‌ష్టంగా నిర్వ‌చించేందుకు స‌రైన‌ ప‌దాలు ఉన్నాయ‌ని నేను అనుకోవ‌ట్లేదు తార‌క్! మ‌న మ‌ధ్య ఉన్న‌ మధురస్మృతులను నేను ఎల్ల‌ప్పుడూ గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటాను. జ‌న్మదిన శుభాకాంక్ష‌లు'' అని చెర్రీ పేర్కొన్నాడు. ఈ ఇద్ద‌రు యంగ్ హీరోలు కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో న‌టించిన విష‌యం తెలిసిందే. 

అలాగే, తార‌క్ కు మ‌హేశ్ బాబుతో పాటు ప‌లువురు సినీ న‌టులు పుట్టిన‌ రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. తార‌క్ మ‌రిన్ని విజ‌యాలు సాధించి, ఎల్ల‌ప్పుడూ సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు.

More Telugu News