Nikhat Zareen: మ‌హిళ‌ల ప్ర‌పంచ బాక్సింగ్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ చేరిన నిఖ‌త్ జ‌రీన్‌

hyderabadi boxer Nikhat Zareen stormed into the final of Womens World Boxing Championship
  • హైద‌రాబాద్‌కు చెందిన‌ నిఖ‌త్ జ‌రీన్‌
  • 52 కిలోల విభాగంలో దూకుడుగా నిఖ‌త్‌
  • సెమీస్‌లో బ్రెజిల్‌కు చెందిన క‌రోలినా అల్మిడా చిత్తు
క్రీడ‌ల్లో భార‌త క్రీడాకారులు స‌త్తా చాటుతున్నారు. నిన్న‌టికి నిన్న బ్యాడ్మింట‌న్‌లో స‌త్తా చాటిన ఇండియ‌న్ స్టార్ ష‌ట్ల‌ర్లు ధామ‌స్ క‌ప్‌ను ఎగుర‌వేసుకుని రాగా... ఇప్పుడు మ‌హిళ‌ల‌ ప్ర‌పంచ బాక్సింగ్ చాంపియ‌న్ షిప్ టైటిల్ వేట‌కు మ‌న హైద‌రాబాద్‌కు చెందిన బాక్సర్ నిఖ‌త్ జ‌రీన్ సిద్థ‌మైపోయింది. బుధ‌వారం సాయంత్రం జ‌రిగిన సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆమె బ్రెజిల్‌కు చెందిన క‌రోలినా అల్మిడాను చిత్తు చేసి ఫైన‌ల్ చేరింది. 52 కిలోల విభాగంలో బ‌రిలోకి దిగిన నిఖ‌త్ నేరుగా ఫైన‌ల్స్‌కు దూసుకెళ్లింది.

ఇప్ప‌టిదాకా ఈ టైటిల్‌ను సాధించిన భార‌త మ‌హిళా బాక్స‌ర్ల‌లో మేరీ కామ్‌, స‌రితా దేవి, జెన్నీ, లేఖ ఉన్నారు. ఈ ద‌ఫా ఫైన‌ల్‌లో విన్న‌ర్‌గా నిలిస్తే... హైద‌రాబాద్‌కు చెందిన నిఖ‌త్ కూడా వీరి స‌ర‌స‌న చేర‌నుంది. బాక్సింగ్‌లో స‌త్తా చాటుతున్న నిఖ‌త్‌... ఇప్ప‌టికే యువ బాక్సింగ్ చాంపియ‌న్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ టోర్నీలో ఆది నుంచి దూకుడుగానే సాగుతున్న జ‌రీన్ ఫైన‌ల్‌లోనూ స‌త్తా చాటి టైటిల్ గెలుస్తుంద‌న్న దిశ‌గా క్రీడా విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.
Nikhat Zareen
Women's World Boxing Championship
Boxer
Hyderabad

More Telugu News