బ్యూటీ పార్లర్ లో సందడి చేసిన మంత్రి రోజా.. వీడియో ఇదిగో!

  • తిరుపతిలో లండన్ బ్యూటోరియం బ్రాంచ్ ను ప్రారంభించిన రోజా
  • క్లినిక్ హెడ్, బ్రాంచ్ ఓనర్ ను అభినందించిన మంత్రి
  • తిరుపతి మహిళలకు నాణ్యమైన సేవలు అందుబాటులోకి వచ్చాయని వ్యాఖ్య
ఏపీ టూరిజం మంత్రి రోజా తిరుపతిలో లండన్ బ్యూటోరియం బ్రాంచ్ ను ప్రారంభించారు. పార్లర్ లో కలియతిరుగుతూ... మహిళలకు అందించబోయే సేవల గురించి తెలుసుకున్నారు. అంతేకాదు స్వయంగా బ్లూటీ పార్లర్ కు చెందిన ప్రొఫెషనల్ తో నెయిల్ కటింగ్ చేయించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, చెన్నై బేస్డ్ లండన్ బ్యూటోరియం బ్రాంచ్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. తిరుపతిలోని మహిళలు అత్యుత్తమ సేవలను ఇక్కడ పొందవచ్చని తెలిపారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాదుల్లో లభించే నాణ్యమైన సేవలు ఇప్పుడు తిరుపతికి కూడా అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఈ సందర్భంగా బ్యూటీ క్లినిక్ హెడ్ జీవిత సత్యనారాయణన్, బ్రాంచ్ ఓనర్ ప్రియాంకను ఆమె అభినందించారు.

Roja
YSRCP
Tirupati
Beauty Clinic
London Beautorium

More Telugu News