అమితాబ్‌ను ముసలోడా అన్న నెటిజన్... సుతిమెత్తగానే బుద్ధి చెప్పిన బిగ్ బీ
- 11.30 గంటలకు గుడ్ మార్నింగ్ చెప్పిన బిగ్ బీ
- సోషల్ మీడియా వేదికగా మొదలైన ట్రోలింగ్
- ఇది మధ్యాహ్నం ముసలోడా అన్న ఓ నెటిజన్
- మిమ్మల్నెవరూ ముసలోడు అని పిలవకూడదనుకుంటున్నానన్న అమితాబ్
అప్పటికే తన గుడ్ మార్నింగ్‌పై జరుగుతున్న ట్రోలింగ్‌కు ఓపికగానే సమాధానం చెబుతూ వచ్చిన అమితాబ్... తనను ముసలోడా అంటూ కామెంట్ చేసిన నెటిజన్‌కు కూడా ఓపికగానే బదులిచ్చారు. "మీరు చాలా కాలం బ్రతకాలని ప్రార్థిస్తున్నాను. అయితే మిమ్మల్ని ఎవరూ ముసలోడు అని పిలిచి అవమానించకూడదని కోరుకుంటున్నా" అంటూ ఆ నెటిజన్‌కు బిగ్ బీ బదులిచ్చారు.